26/06/2020
Date: 25-06-2020
ప్రెస్ నోట్:
పబ్లిక్ హెల్త్ కౌన్సిల్ మహబూబాబాద్ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక: పబ్లిక్ హెల్త్ కౌన్సిల్ మహబూబాబాద్ జిల్లా జనరల్ బాడీ సమావేశంలో పబ్లిక్ హెల్త్ కౌన్సిల్ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ గారు ప్రతిపాదించిన “ మహబూబాబాద్ జిల్లా పబ్లిక్ హెల్త్ కౌన్సిల్” కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది.
మహాబుబాబాద్ జిల్లా కమిటీ:
అధ్యక్షులు: దైద ప్రదీప్ కుమార్
ఉపాధ్యక్షులు: ఎండి ఇస్మాయిల్
ప్రధానకార్యదర్శి: ఏండ్ల వెంకటేశ్వర్లు
సహాయకార్యదర్శి: పుప్పాల హరీష్ గౌడ్
కోశాధికారి: గూడెల్లి యాకయ్య
కార్యవర్గ సభ్యులు:
పగిడిపల్లి మురళీ కృష్ణ
అమ్గోత్ రమేష్
మహబూబాబాద్ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నికను పబ్లిక్ హెల్త్ కౌన్సిల్ చైర్మెన్ డాక్టర్ ఎం. ఏ. షోయబ్ దృవీకరిస్తూ నూతనకమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కమిటి పదవీ కాలం మూడు సంవత్సరాలు కొనసాగుతుందని, జిల్లా కమిటీ నియామక ధ్రువీకరణ సందేశంలో తీయజేయడం జరిగింది. ప్రభుత్వ మరియు పౌరసమన్వయంతో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కునే ప్రతి ఒక్కరికి పబ్లిక్ హెల్త్ కౌన్సిల్ చేయూతనిస్తుందని అందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయి నుండి ఆరోగ్య పరిరక్షణకు పబ్లిక్ హెల్త్ కౌన్సిల్ పూనుకున్న విషయాన్ని పునరుద్ఘాటించారు.
నానాటికి పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకుతోడు అకస్మాత్తుగా ఎదురైన కరోనా మహమ్మారి భయం సగటు పౌరులను కలవరానికి గురిచేస్తున్న సందర్భమిది, ఉపాధి లేక ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రస్తుత సమయంలో ఆస్పత్రి ఖర్చులు తలుచుకుంటేనే గుండె గుబేలు మంటుంది. ఇక కరోనతో సహజీవనమే అనివార్యమైన సందర్భాన్ని ఊహించుకుంటే ప్రజలకు వణికిపోతున్నారు.
ఒక్కప్పుడు కపిస్కలో కలిపిన కాషాయాలు తాగి ఎంతో ఆరోగ్యంగా బ్రతికిన ప్రజలు, ఈ రోజు కార్పోరేట్ ఆస్పత్రుల కభందహస్తాలలో చిక్కుకున్నారు. చిన్నచిన్న రుగ్మతలకు సహితం పెద్ద పెద్ద ఆస్పత్రుల పై ఆధారపడేదుస్థితి ఏర్పడింది.
రోగులు ఇప్పుడు వ్యాపార వస్తువులుగా మార్చబడ్డారు. రోగాలతో లేక ప్రమాదావశాత్తు ఆస్పత్రిపాలై పెద్దమొత్తంలో బిల్లుకడితే ఇంటికి, లేకుంటే నేరుగా కాటికేదారి చూపిస్తున్నాయి కాస్ర్పొరేటు ఆస్పత్రులు. ఈ పరిస్థితికళ్లెం వేయాలనే దృడసంకల్పంతో పబ్లిక్ హెల్త్ కౌన్సిల్ “అందరికీ ఆరోగ్యం మరియు సాధికారత” అనే వినూత్న కార్యక్రమానికి పునాదులు వేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం "ఆరోగ్యం అంటే కేవలం జబ్బులేకపోవడం మాత్రమేకాదు, శారీరకంగా,మానసికంగా,సామాజికంగా మరియు ఆర్థికంగా బాగుండే స్థితి" అని చాలస్పష్టంగా వివరించడం జరిగింది. కాని ప్రస్తుతం మన దేశ పరిస్తితులు గమనిస్తే ఆరోగ్యరంగమంటే కేవలం వైద్యం (చికిత్స) చేయడం, వీలైనంత ఎక్కువ డబ్బు గుంజడమే కనిపిస్తుంది కాని ముందస్తు రోగ నివారణ విధానాలపై దృష్టిపెట్టకపోవడంతో ఆరోగ్యరం పూర్తివ్యాపారంగా మారిపోయింది. ఒకప్పుడు మహానగరాలకే పరిమితమైన ఈ వ్యాపార ధోరణి సాపకిందనీరులా గ్రామస్థాయికి ప్రాకిపోయింది.
ఆస్పత్రులు అంటేనే ప్రజలు గజ గాజ వనికిపోయే దుర్మార్గమైన పరిస్థితులు దాపురించాయి. ఈ పరిస్థితుల నుండి ప్రజలను కాపాడుకోవలసిన కర్తవ్యం, బాధ్యత ప్రాధమిక ఆరోగ్య బృందాలపై ఉందని అందుకు “పబ్లిక్ హెల్త్ కౌన్సిల్ ” గ్రామ స్థాయినుండి పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థకు రూపకల్పన చేసిందని తెలియజేసారు.
ఈ కార్యక్రమ ప్రధానలక్ష్యం ప్రతిపౌరునికి ఆరోగ్యంగా ఆర్ధిక సావలంభానతో బ్రతికే అవకాశాన్ని కల్పిస్తూ ప్రజలకు నామమాత్రపు సేవారుసుముతో సహాకార వ్యవస్ధద్వార వైద్య మరియు ఆరోగ్యసేవలు” ప్రజలకు అందుబాటులోకి తేవడం.
విధ్యావంతులైన యువతీయువకులకు లాభాపేక్షలేని శిక్షణ మరియు తక్షణ ఉపాది అవకాశాలు కల్పించదానికి పబ్లిక్ హెల్త్ కౌన్సిల్ దానికి అనుభందంగా ఉన్న వైద్య ఆరోగ్య సహాకార సంఘాలు ఆయా జిల్లా, మండల గ్రామ కమిటీల సమన్వయముతో స్వచ్చందంగా కృషి చేస్తాయని తెలియజేసారు. ప్రతిపాదిత శిక్షణలో ప్రజలకు సాధారణంగాసోకే దాదాపు 280 రకాల సాధారణ రుగ్మతలపై ఆరోగ్యకార్యకర్తలకు తగుఅవగాహన కల్పించడం జరుగుతుందని, అందులో భాగంగా రోగనిర్ధారణ విధానం, మరియు ప్రదమ చికిత్స 100 గంటల నిడివి గల ఈ ప్రత్యేక శిక్షణలో థియరీతోపాటు సందర్భోచిత ప్రాక్టికల్స్ కూడా ఉంటాయని, ప్రజాఆరోగ్య పరిరక్షణపై అపార అనుభవంగల నిష్ణాతులైన వైద్యులచే ఆరోగ్య కార్యకర్తలకు తగు శిక్షణ ఇప్పించడం జరుగుతుందని, శిక్షణలో ప్రతిభ కనబరిచిన వారి సేవలు తక్షణమే / నగరాలలోని మురికి వాడల్లో/ భీద ప్రజలు నివసించే బస్తీల్లల్లో అందుబాటులోకి తేవడం జరుగుతుందని తెలిపారు.
ఈ ఆరోగ్య అవగాహన బృందాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 వేల మంది నిరుద్యోగ యువతీయువలుకలకు తక్షణ స్వయం ఉపాది లభించే అవకాశం ఉంటుంది. పర్యావసానంగా ప్రజలకు సముచిత ఆరోగ్యఅవగాహన మరియు ప్రాథమిక చికిత్సలు అందుబాటులొకివస్తాయి. ప్రతిదానికీ పట్టణ బాట పట్టకుండా మండల స్థాయిలోనే నాణ్యమైన రోగనిర్ధారణ కేంద్రాల నిర్వహణ, యోగ్యులైన డాక్టర్లచే చికిత్స అందుబాటుకి వస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం చికిత్సకన్నా నివారణే మిన్న అన్ననానుడి అక్షరాల నిజమౌతుందని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.
నోట్: ప్రతిపాదిత కార్యక్రమాల్లో పాల్గొని ఆరోగ్యావగాన కార్యకర్తలుగా కొనసాగాలనుకునే మహబూబాబాద్ జిల్లా యువత జిల్లా అధ్యక్షులు దైద ప్రదీప్ కుమార్ గారిని సంప్రసాదించవచ్చు.
భవదీయ.
రత్నాకర శర్మ
రాష్ట్ర ప్రధాన సమన్వయకర్త
పబ్లిక్ హెల్త్ కౌన్సిల్
తెలంగాణ రాష్ట్ర కమిటి